Monday, December 23, 2024

టి ప్రైడ్‌తో దళితుల పారిశ్రామికభివృద్దికోసం రూ. 2759 కోట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ప్రధానంగా పరిశ్రమలఏర్పాటుపై దృష్టి సారించింది. ఒక వైపు జాతీయ అంతర్జాయ పరిశ్రమలను ఏర్పాటను ప్రోత్సహిస్తూనే మరో వైపు స్థానికంగా ఉండే పరిశ్రమలను అభివృద్ది చేయాలనే లక్షాన్ని నిర్ణయించుకుంది. దీని కోసం 2014 15 తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, అండర్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ ( టి ఐడియా), తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత ఎంటర్‌ప్రెన్యూనర్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ( టి ప్రైడ్ ) వంటి విధానాలను అమలు చేస్తోంది. ఈ విధానంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, దివ్యాంగుల వంటి అట్టడుగున ఉన్న వర్గాలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు వీటిని రూపొందించినట్లు తెలంగాణ సాంఘిక ఆర్దిక ముఖచిత్రం ( ఎస్‌ఇవో ) వెల్లడించింది.

టి ప్రైడ్ ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, దివ్యాంగుల నుంచి పారిశ్రామిక వేత్తల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా పారిశ్రామిక రంగంలో సమానత్వం సాధించే లక్షంతో టి ప్రైడ్ ఏర్పడింది. ఈ పథకం ద్వారా పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, ప్రత్యక్ష నిధులు, మార్జిన్ మనినీ అందిండం, పెద్ద పరిశ్రమలో ఉప కాంట్రాక్టు ఏర్పాటు చేయడం అదనపు పెట్టుబడి, రాయితీలు,ఇతర రీయంబర్స్‌మెంట్ అందిస్తూ సివిల్ కాంట్రాక్టర్ల వర్గాన్ని ప్రోత్సహిస్తోంది. 201415లో టి ప్రైడ్‌ను ప్రవేశ పెట్టినప్పటి నుంచి నేటి వరకు (2023 జనవరి ) రూ, 2759. కోట్ల ద్వారా 61,258 క్లైమ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2022 23 మధ్యకాలంలో 7596 క్లైమ్‌లను మంజూరు చేసి వాటి ద్వారా 354.64 కోట్లు మంజూరు చేసింది.

టి ప్రైడ్ ద్వారా 2014 15 నుంచి 202223 వరకు ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల పారిశ్రామికాభివృద్దికి కోసం విడుదల మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం                                          (రూ. కోట్లలో)
2014-15                                         రూ.55.00
2015-16                                         రూ.92.00
2016-17                                         రూ.239.00
2017-18                                         రూ.367.00
2018-19                                         రూ.364.00
2019-20                                         రూ.444.00
2020-21                                         రూ. 374.00
2021-22                                         రూ.469.00
2022-23                                         రూ. 354.00

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News