- Advertisement -
వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు నియామకం
న్యూఢిల్లీ : ఐపిఎస్ సీనియర్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరిని శశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ఉత్తర్వులో తెలియజేసింది. 1990 ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐపిఎస్ అధికారి అయిన చౌదరి ప్రస్తుతం కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్‌పిఎఫ్) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. 2025 నవంబర్ 30 వరకు ఎస్‌ఎస్‌బి డిజిగా చౌదరి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించినట్లు ఆ ఉత్తర్వు తెలిపింది. వచ్చే ఏడాది నవంబర్ 30న ఆయన రిటైర్ కానున్నారు. ఎస్‌ఎస్‌బి గార్డులు నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు.
- Advertisement -