Saturday, December 21, 2024

‘దం దం దంపుడు లక్ష్మీ’

- Advertisement -
- Advertisement -

 

రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా ‘మాటరాని మౌనమిది‘. ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో ట్రైన్ అయిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ హీరోహీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. లవ్ స్టోరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో మల్టీ జోనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘దం దం దంపుడు లక్ష్మీ’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. అషిర్ లూక్ స్వరపర్చిన ఈపాటకు డి సయ్యద్ బాషా సాహిత్యాన్ని అందించగా రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి ఆలపించారు. ఈ పాటలో జాస్ప్రీత్ కౌర్ హుషారుగా డాన్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News