దామెర: పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంఘటన వరంగల్ జిలా దామెర పోలీస్ స్టేషన్‌లో జరిగింది. దామెర పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు డిమాండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంవత్సరం క్రితం దామెర పోలీస్ స్టేషన్ పేరు మీద ఓ ఫేస్‌బుక్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు. గత కొంత కాలంగా వాడకపోవడంతో మరో ఎకౌంట్ క్రియేట్ చేసి వాడుతున్నారు. పాత ఫేస్‌బుక్ ఎకౌంట్ వాడకపోవడంతో హ్యాకర్లు ఎకౌంట్ హ్యాక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలంటూ కొందరికి సందేశాలు పంపించారు. దీంతో కొందరు స్థానిక ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే భాస్కర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎవరూ డబ్బులు పంపించకపోవడంతో ఎకౌంట్‌ను బ్లాక్ చేశారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా పని చేసినట్టు పోలీసులు గుర్తించారు.