Sunday, January 19, 2025

కాంగ్రెస్‌లో దామోదర కలకలం… రేవంత్ ఇంటి ముట్టడి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కలకలం సృష్టిస్తున్నారు. త్వరలో పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. పటాన్ చెరు, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ టికెట్ల ప్రకటనపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరులు కాట శ్రీనివాస్, సంజీవ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పార్టీలో టికెట్ ఇస్తున్నారని దామోదర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కాట శ్రీనివాస్ అనుచరులు బయలుదేరారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ టికెట్ కాటా శ్రీనివాస్ కు కాకుండా నీలం మధు ముదిరాజ్ కు ఇవ్వడంతో శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా 10 రోజుల క్రితం చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాటా శ్రీనివాస్ ఇంటి వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.  జూబ్లీహిల్స్ లోని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వాహనాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News