Wednesday, January 22, 2025

ఖర్గేకు దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ నేత ఆర్ దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దామోదర్ రెడ్డి నివేదిక ఇచ్చారు. లీడర్ల కంటే క్యాడర్ పోవడంతో పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి రిఫీట్ అవుతుందని తెలియజేశారు. దామోదర్ రెడ్డి నివేదికతో అధిష్టానం అప్రమత్తమైంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల తగాదాలతో దీనస్థితికి చేరుకుందని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌ను సిఎం కెసిఆర్ పైకి లేవకుండా అణగదొక్కారు. మరో వైపు కాంగ్రెస్ స్థానంలోకి బిజెపి దూసుకొస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News