Monday, January 20, 2025

బాధిత కుటుంబాలకు దామోదర రాజనర్సింహ పరామర్శ

- Advertisement -
- Advertisement -

చౌటకూర్: మండల పరిధిలోని చెక్రియాలు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రెండు కుటుంబాలను దామోదర్ రాజనర్సింహ పరమర్శించాడు. జంగం బండప్ప కుమారుడు గుండప్ప కుటుంబానీకి గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని, నీరుడి రాములు కుమారుడైన దశరథ్ కుటుంబానికి దశరథ్‌కి ఇద్దరు ఆడపిల్లలు అయినందున కొంత డబ్బును బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. దుఃఖ సముద్రంలో ఉన్న కుటుంబాలకు మీ వెనక నేనున్నానంటూ గుండె ధైర్యాన్ని అందించాడు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చౌట్కూర్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ , చౌట్కూర్ మండల్ రజాక సంఘం అధ్యక్షులు సిహెచ్ అశోక్, చక్రియాలు గ్రామ అధ్యక్షుడు రాజశేఖర్ , చక్రియాలు యూత్ అధ్యక్షుడు బాలరాజు కాంగ్రెస్ మండల పెద్దలు మల్లారెడ్డి పండరి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపిటిసి పాండు, చెక్రియల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News