Sunday, September 29, 2024

బూచి కాదు..భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: భవిష్యత్తు తరాల కోసమే హైడ్రా పనిచేస్తుందని, హైడ్రా అంటే బూచీ కాదు.. భరోసా అని.. హైడ్రా అంటే భయంకాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. పర్మిషన్ ఉ న్న ఏ నిర్మాణాన్ని కూల్చివేయదనీ, ఇండ్లలో కు టుంబాలు నివసిస్తున్న వాటిని కూడా హైడ్రా చర్య లు తీసుకోద ని ఆయన స్పష్టంచేశారు. కూల్చివేత లు ఆగాయంటే ఊరుకోలేదనీ, గ్రౌండ్ వర్క్ చేస్తున్నామనీ, కొన్ని భవనాల వద్ద ఉన్న లీగల్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని తరువాయి
తెలిపారు. చెరువులో ఇండ్లు కట్టుకోవడం ఎవరికీ హక్కు కాదని, పిల్లలు చదువుతున్నారనే మల్లారెడ్డి, ఒవైసీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిర్మాణాలపై ఆగామని రంగనాథ్ తెలిపారు.

పేదలను అడ్డుపెట్టుకొని పెద్దలు తప్పించుకోలేరని హెచ్చరించారు. పేదలు, మధ్య తరగతి వాళ్లకు అన్యాయం చేయాలనే ఉద్దేశం హైడ్రాకు లేదని, ఇప్పటి వరకు వారికి ఏలాంటి అన్యాయం చేయలేదని రంగనాథ్ చెప్పారు. చెరువుల్లో నిర్మాణాలు ఉంటే వాటికి నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, అయినా సంబంధిత విభాగాల నుంచి నోటీసులు ఇచ్చి మరీ చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు. చిన్న వాళ్లు, పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదని, టైం ఇస్తున్నామని, వాళ్లకు న్యాయంచేసి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పర్మిషన్లు రద్దయిన వాటిని, అనుమతి లేకుండా కట్టిన బిల్డర్‌ను ప్రశ్నించాలని రంగనాథ్ సూచించారు. నిర్మాణాలకు సర్పంచులు అనుమతివ్వరని, సెక్రెటరీ ఇస్తారని, అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన వారు విభాగపరమైన చర్యలకు గురయ్యారని ఆయన గుర్తుచేశారు. భూయజమానులకు నోటీసులిచ్చినా.. వాళ్లు లీజుదారులకు చెప్పట్లేదన్నారు. జన్వాడ ఫౌమ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉన్నందున్న అది హైడ్రా పరిధిలోకి రాదన్నారు. అక్కడి అధికారులు చూస్తారని చెప్పారు.

ప్రజల ఫిర్యాదుల ఆధారంగానే కూల్చివేతలు : దానకిషోర్
ప్రజల ఫిర్యాదు ఆధారంగానే కూల్చివేతలు జరుగుతున్నాయని, హైడ్రా సొంత నిర్ణయాలు కాదని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి -దానకిశోర్ స్పష్టం చేశారు. మూసీనదికి పూర్వ వైభవం తీసుకురావడం కోసమే మూసీనది ప్రాజెక్టును చేపట్టామని వెల్లడించారు. మూసీ నది వెంట ఉన్న పేదలను పారదర్శకంగా మాత్రమే, వారి సమ్మతితోనే, నిన్నటి వరకు 50 కుటుంబాలను, శనివారం రోజున 150 కుటుంబలాను డబుల్ బెడ్‌రూంలకు తరలించామని, 14 ప్రాంతాల్లోని ఇండ్లకు చేర్చామనీ, వీరిని బలవంతగా పంపించడంలేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీనది నిర్వాసితులకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఓ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

వీరికి సహాయ సహాకారాలను అందించడం కోసం బీసి, ఎస్‌స్సీ, ఎస్టీ కార్పొరేషనలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు, గ్యాస్ చిరునామాలు మార్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు దానకిషోర్ వెల్లడించారు. మూసీ బాధితుల పిల్లల విద్యాలయాల విషయంలోనూ విద్యాధికారులతో చర్చలు జరుపుతున్నామని, వారికి తగిన పాఠశాలల్లో చేర్పించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. డబుల్ బెడ్ రూంలను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ. 700 కోట్లు మంజూరు చేయమన్నాం. అవి రాగానే పెండింగ్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తిచేసి మూసీ నిర్వాసితులకు అందజేస్తామని చెప్పారు.

3 అంశాలే టార్గెట్..
నగరంలోని మూసీనదిని క్లీన్ నది, రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, జీవనోఫాధి అనే మూడు అంశాలే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందని దానకిషోర్ తెలిపారు. మూసీనది 55 కి.మీ.ల మేర ఉన్నదని, మూసీనదిలో బాపుఘాట్ నుంచి గౌరెల్లి వరకు కారిడార్‌ను నిర్మిస్తున్నామని, దీనికి ఇరువైపుల ర్యాంప్‌లు 1618 వరకు వస్తున్నాయని వెల్లడించారు. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో ఉన్న హన్ నది తరహాలో, లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో హైదరాబాద్ నగర మూసీనదిని అభివృద్దిపరిచి సుందరీకరిస్తామని చెప్పారు. పారిస్(ఫ్రాన్స్)లోని సియేన్ నది వెంట ఉన్న వ్యాపార కేంద్రాల తరహాలోనే మూసీ నది వెంట వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి నగర హాకర్లను అక్కడకు తరలించాలనే ప్లాన్ ఉన్నట్టు దానకిషోర్ తెలిపారు.

అక్టోబర్ నెలలో దక్షణ కొరియాకు వెళ్ళి అక్కడి నదులను అధ్యయనం చేసి రానున్నామని ఆయన తెలిపారు. ఈ టూర్ లో మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు ఉంటారన్నారు. మూసీ ప్రాజెక్టు కోసం ఏఐడిబి నుంచి రూ. 7000 కోట్లను రుణంగా తీసుకోబోతున్నామని వెల్లడించారు. 2026 నాటికి మూసీనదిలో మంచినీరు ప్రవహించేలా ఎస్‌టిపిలను ఏర్పాటు చేసేందుకు రూ. 10 వేల కోట్లు వెచ్చించనున్నది ప్రభుత్వమని అన్నారు. మూసీనదికి ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్ ను రూపొందిస్తున్నామని, ఇందుకు ఇంటర్నేషనల్ ఏజెన్సీలను పిలుస్తున్నామని దానకిషోర్ తెలిపారు. ఈ ఏజెన్సీలు మూసీ సుందరీకరణకు ప్రతినాలుగు మాసాలకొక ప్లాన్ అందిస్తారనీ, ఆ ప్లాన్ ప్రకారంగా పనులు చేసుకుంటూ వెళ్తుంటామని ఆయన పేర్కొన్నారు.

సిస్టంలో లోపాలున్నాయి
పరిపాలనా వ్యవస్థలో లోపాలున్నాయి. మునిసిపాలిటీలు మంజూరు చేసిన అనుమతులకు అత్యంత విలువ ఉన్నది. చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల ఖరారులో కొంత సందిగ్థత నెలకొన్నదనీ, అధికారులు మంజూరు చేసిన అనుమతులనే తుదిగా తీసుకుంటామని దానకిషోర్ స్పష్టంచేశారు. వచ్చే రెండుమూడు రోజుల్లో కొత్త సిస్టంను అమలు చేయబోతున్నామని, మనం కంప్యూటర్ ముందే కూర్చుని ‘త్రీడి’ కళ్ళజోడు పెట్టుకుని మౌస్‌ను కదిలిస్తూ ఉంటే మన ప్లాట్, ఇండ్లు, భూమి ఏ సర్వే నెంబర్‌లో ఉన్నది. ఏ చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లో ఉన్నది లేనిది..? వంటి విషయాలు తెలుసుకోవచ్చని దానకిషోర్ వెల్లడించారు. దీంతో మన భూమి సర్వే నెంబర్ కూడా స్పష్టంగా తెలిసిపోతుందని ఆయన తెలిపారు. ఇదే సాంకేతిక వ్యవస్థను కూడా రెరాలోనూ అమలు చేయబోతున్నామని తెలిపారు. దీంతో అనుమతుల మంజూరులో ఏలాంటి లోపం, పొరపాటు లేకుండా ఉంటుందని, హైడ్రా కూడా త్వరలోనే వెబ్‌సైట్ ఏర్పాటు చేయనున్నదని, దాని ద్వారా కూడా చెరువుల వివరాలు సమగ్రంగా తెలుస్తాయని దానకిషోర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News