Thursday, January 23, 2025

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు దానం రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిగా సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మోటార్లకు మీటర్లు పెడుతామని చెప్పింది కేంద్రం కాదా? అని దానం అడిగారు. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులనూ అడ్డుకుంటున్నారని, కిషన్ రెడ్డి తన మాయమాటలను పక్కన పెట్టాలన్నారు. కేంద్రం ఇప్పటికైనా తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని దానం అడిగారు. రెండో రాజధాని హైదరాబాద్ అంటూ బిజెపి మాయమాటలు చెబుతోందని, ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయన్నారు.

Also Read: రోహిత్‌కు విశ్రాంతి… కెప్టెన్‌గా రహానే?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News