Monday, December 23, 2024

కాంగ్రెస్ లోకి దానం?.. సిఎం రేవంత్ తో భేటీ

- Advertisement -
- Advertisement -

మరో ఎమ్మెల్యే బిఆర్ఎస్ చేతినుంచి జారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంనుంచి గెలిచిన దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దానం నేరుగా సిఎం ఇంటికి వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలు గుప్పుమంటున్నాయి.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దానం ప్రశంసలు కురిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేసి, ఆ పదవిని సాధించుకున్నారని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనడం భావ్యం కాదని ఒక సందర్భంలో అన్నారు. ఇటీవల దానం మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు రోజుకో పండుగ వస్తోందని ప్రశంసించారు. రేవంత్ సర్కార్ ఉద్యోగులకు అన్నీ శుభవార్తలే చెబుతోందని కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News