Wednesday, January 22, 2025

నేను పార్టీ మారడంలేదు: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకుడు దానం నాగేందర్ స్పందించారు. ప్రస్తుతానికి బిఆర్‌ఎస్ పార్టీని వీడటం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని, సికింద్రాబాద్ నుంచి ఎంపి అభ్యర్థిని కాదని ఆయన పేర్కొన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సమావేశం కావడంతో పార్టీ మారుతారనే న్యూస్ వైరల్‌గా మారింది. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ నెల 18న దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News