Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు టార్గెట్ చేశారు…. క్షమాపణ చెబుతున్నా: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కావాలనే తనని టార్గెట్ చేశారని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మండిపడ్డారు. ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడేటప్పుడు ఆటంకం కలిగించారని, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు మాట్లాడింది మైక్‌లో రికార్డు కాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తనని కించపరిచే విధంగా మాట్లాడడంతోనే తాను సహనం కోల్పోయానని వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధను కలిగిస్తే క్షమాపణ చెబుతున్నానని, గత పది సంవత్సరాల నుంచి తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దానం మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పద్ధతిని మార్చుకోవాలని హితువు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీలో హైదరాబాద్ నగర పరిస్థితిపై దానం నాగేందర్ మాట్లాడుతుండగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గోల చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ ‘మీరు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనియ్యం కొడకల్లారా.. తోలు తీస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకాలు ఆడుతుతున్నారా? అంటూ ఆవేశంగా మాట్లాడిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News