Friday, December 20, 2024

ఫిరాయింపులపై న్యాయపోరాటం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం
దానం నాగేందర్‌ను
అనర్హుడిగా ప్రకటించాలంటూ
హైకోర్టులో పిటిషన్
త్వరలో కడియం శ్రీహరి,
తెల్లం వెంకట్రావులపైనా
కోర్టులో అనర్హత పిటిషన్
దానంపై ఇప్పటికే స్పీకర్
గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు
మూడు నెలల్లోగా అనర్హత
పిటిషన్లపై నిర్ణయం
తీసుకోవాలన్న సుప్రీం కోర్టు
తీర్పును ప్రస్తావిస్తున్న
బిఆర్‌ఎస్ నేతలు

మన తెంలగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ అనర్హ తా పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయానికి వ చ్చింది. ఇలా చేయడం ద్వారా వలసలను అడ్డుకోవాలని పార్టీ భావిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఉ న్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎంఎల్‌ఎల వలసలకు అడ్డుకట్ట వేయాలని బిఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చూడడం ద్వారా ఇతర శా సనసభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చ ని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది.

బిఆర్‌ఎస్ బీ ఫాంపై గెలిచిన దానం నాగేందర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీలో ఎంఎల్‌ఎగా గెలిచిన వ్యక్తి మరొక పార్టీ ఎన్నికల అభ్యర్థి కావడానికి మించి అనర్హతా వేటుకు ఆధారం అవసరం లేదని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని ఆ పార్టీ చెబుతోంది. అలాగే స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపైనా అనర్హతా పిటిషన్ దాఖలుకు బిఆర్‌ఎస్ సిద్ధమైంది. త్వరలోనే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపైనా హైకోర్టులో అనర్హతా పిటిషన్ దాఖలు చేయనున్నారు. వీరిలాగా బిఆర్‌ఎస్ బీ ఫాంతో గెలిచిన ఎంఎల్‌ఎలు ఎవరు పార్టీని వీడినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనర్హతా పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నేతలకు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News