Sunday, January 19, 2025

సికింద్రాబాద్ లో బిఆర్ఎస్ ను ఓడించి కవితకు కెసిఆర్ బెయిల్ తెచ్చుకుంటారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో మంచి పోజిషన్‌లో ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాలో దానం నాగేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీదే అధికారం అనే నానుడి ఉందన్నారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మతసామరస్యం వెల్లివిరిసిందని, బస్తీలు బాగుపడాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. వరదల్లో ప్రజలు మునిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ సాయం చేయలేదని, కేంద్రం నుంచి కనీసం పైసా వరద సాయం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మెట్రో తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, గ్రేటర్ హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ప్రశంసించారు. బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే బిజెపికి లాభం జరుగుతుందని, కెసిఆర్ సికింద్రాబాద్ సీటును బిజెపికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావును ఓడించి కెసిఆర్ తన బిడ్డ కవితకు బెయిల్ తెచ్చుకుంటారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News