Saturday, December 21, 2024

ఫిల్మ్ చాంబర్లో డ్యాన్సర్లకు ఆడిషన్స్.. ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

Dance Auditions in Film Chamber: Telugu dancers union

ప్రస్తుతం డ్యాన్సర్ల కొరత ఉందని, ప్రతిభ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ కోరింది. ఫిల్మ్ చాంబర్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఆడిషన్స్ జరుగుతాయని సంస్థ తెలిపింది. 33 ఏళ్లుగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ అసోసియేషన్ ఇప్పుడు డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సత్య మాస్టర్ మాట్లాడుతూ.. ‘నిజాయితీగా పనిచేస్తే డాన్స్ మాస్టర్‌గా అద్భుతాలు స్రృష్టించవచ్చు. అలాంటి వాళ్ళకోసమే ఈ ఆడిషన్స్. తప్పకుండా ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు అందరూ పాల్గొనాలని’ అన్నారు.

డాన్యర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు మా వద్ద 130 మంది మాస్టర్లు, 500 మంది డ్యాన్సర్లున్నారు. 200 మంది మెంబర్ షిప్ కానివాళ్లు ఉన్నారు. మూ డ్రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. అం దరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని తెలిపా రు. ఈ కార్యక్రమంలో యానీ మాస్టర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కు మార్, ఫౌండర్ సోమరాజు, పాల్ మాస్టర్, ప్రకా ష్ మాస్టర్, శ్రీధర్ రెడ్డి, భాను మాస్టర్, యశ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News