- Advertisement -
హైదరాబాద్: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ డ్యాన్స్ మాస్టర్‌ను ఎస్ఆర్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లికి చెందిన సిహెచ్ వినోద్ నగరంలోని మధురానగర్‌లోని మెన్స్ హాస్టల్లో ఉంటూ స్థానికంగా డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. కరోనా వల్ల గత ఏడాది నుంచి పనిలేకుండా పోయింది. వేరే ఉద్యోగం కోసం వేతికినా ఎక్కడా లభించలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో స్నేహితుల వద్ద అప్పు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించేందుకు చైన్‌స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే మధురానగర్ మెట్రోస్టేషన్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహిళ మెడలోని చైన్‌ను స్నాచింగ్ చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
- Advertisement -