Thursday, January 23, 2025

బర్త్ డే పార్టీ… డ్యాన్సర్‌పై ఆరుగురు అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

 

లక్నో: బర్త్ డే పార్టీకి వచ్చిన డ్యాన్సర్‌పై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావో జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాజుమౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ డీలర్ తన బర్త్ డే పార్టీ కోసం ఆరు వేల రూపాయలు ఇచ్చి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చాడు. ముగ్గురు మహిళలు డ్యాన్స్ చేసి పార్టీ ముగిసిన తరువాత వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు ఒక డ్యాన్సర్‌ను ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. డ్యాన్సర్ వెళ్లి స్థానిక జాజుమౌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్నావో పోలీస్ స్టేషన్‌లో ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌పి సిద్ధార్థ్
మీనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News