Monday, December 23, 2024

వాచ్‌మెన్ హత్య కేసులో డ్యాన్సర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాచ్‌మెన్‌ను బిల్డింగ్‌పై నుంచి నెట్టివేసి హత్య చేసిన సినీ డ్యాన్సర్‌ను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…సినిమాల్లో డ్యాన్సర్లుగా పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు కృష్ణానగర్‌లోని రాఘవగెస్ట్ హౌస్, లాడ్జిలో ఉంటున్నారు. కాగా గురువారం రాత్రి వారు మద్యం తాగి గొడవ చేస్తుండగా వాచ్‌మెన్ యాదగిరి వారిని వారించాడు.

దీంతో మద్యం మత్తులో ఉన్న డ్యాన్సర్ మణికంఠ వాచ్‌మెన్ యాదగిరిని బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. వాచ్‌మెన్‌ను హత్య చేసిన మణికంఠను అరెస్టు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News