Monday, January 20, 2025

పెళ్లిలో కత్తులతో డ్యాన్స్: వద్దన్నందుకు యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

 

పట్నా: పెళ్లి వేడుకలో కత్తులు చేతిలో పట్టుకుని ద్యాన్స్ చేస్తున్న మగపెళ్లివారికి అభ్యంతరం చెప్పినందుకు ఒక యువకుడు అవే కత్తులతో హత్యకు గురయ్యాడు. బీహార్‌లోని సుపోల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన సంభవించింది. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గొరియారి తోలా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతుండగా డిజె పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ వరుడి తరఫు బంధువులు కొందరు కత్తులు చేతిలో పట్టుకున్నారు.

Also Read: ఆ మామిడిపండు ధర వింటే షాక్ అవుతారు..

ఇది మంచి పద్ధతి కాదంటూ వధువు తాలూకు బంధువు అభ్యంతరం చెప్పగా లలన్ ముఖియా అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అతడి శరీరంపై అనేక చోట్ల కత్తులతో ఆ యువకులు పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ముఖియాను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ముఖియా తండ్రి మునేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News