Monday, December 23, 2024

సుహానాను కాటేసింది చర్మవ్యాధే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దంగల్ సినిమాలోని బాలనటి సుహానా భట్నాగర్ మృతికి అసలు కారణం అత్యంత అరుదైన చర్మవ్యాధి డెర్మటోమయెసైటిస్ అని నిర్థారణ అయింది. కుస్తీ క్రీడ ప్రధాన ఇతివృత్తంగా అమీర్ ఖాన్ తీసిన సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన బాలనటి యువప్రాయంలో కేవలం 19 సంవత్సరాలకు మృతి చెందింది. ఈ అమ్మాయికి అత్యంత అరుదైన ఈ వ్యాధి సోకిందని, వంటిపై దుద్దుర్లు సోకాయని, ఈ క్రమంలో ఎయిమ్స్‌లో చికిత్సకు ఆమె చేర్పించారు. అయితే రెండు రోజుల క్రితం మృతిచెందింది.

రెండు నెలల క్రితం ఆమెకు ఈ వ్యాధిలక్షణాలు ఏర్పడ్డాయి. పదిరోజుల క్రితమే ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారు. ముందుగా శరీరంలోని కండరాలలో తలెత్తే ఈ లక్షణాలు తరువాత శరీరం అంతా వ్యాపిస్తాయి. వాపు ఏర్పడుతుంది. ఏ వయస్సులోని వారికి అయినా ఇది సోకుతుంది. ప్రత్యేకించి వృద్ధులలో ఎక్కువగా ప్రాణాంతకం అవుతుంది. ప్రత్యేకించి మహిళలే ఎక్కువగా వారి శారీరక ప్రకృతి ధర్మంతో ఈ డర్మటోమైసిటిస్‌కు గురవుతారని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News