Sunday, January 19, 2025

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం పిఐబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర జలవనరుల సం ఘం (సిడబ్యుసి) అనుమతులు ఇవ్వకుండానే కొన్నింటికి సిడబ్ల్యుసి అ నుమతులు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. గోదావరి నదిపై ఇంతపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు కనీసం జిఎస్‌ఐ రిపోర్టు కూడా తీసుకోకపోవటం అన్నింటికన్నా అతిపెద్ద తప్పదం అన్నా రు.తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టుని  నిర్మించి ఉంటే 30వేల కోట్ల ఖర్చుతోనే 16.50లక్షల ఎకరాలకు నీరందివుండేదని సిడబ్ల్యుసి తెలిపిందన్నారు. 2014నాటికే ప్రాణహితచేవెళ్ల పనులకు అప్పటి ప్రభుత్వం 11,971కోట్లు వ్యయం చేసిందని తెలిపారు. హెడ్‌వర్క్ లేకుండా కాల్వలు తవ్వారన్నారు. తుమ్మడిహెట్టి వద్ద 165టిఎంసీలు లభ్యత లేదని కేవలం 65టిఎంసీలే ఉంటాయని సిడబ్యుసి తెలినట్టు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్దం చెప్పిందన్నారు. బ్యారేజిని మేడిగడ్డకు మార్చిందన్నారు. తుమ్మిడిహెట్టివద్ద నిర్మించి వుంటే ఏటా విద్యుత్ చార్జీల కింద రూ.10500కోట్లు ఆదా అయ్యేవన్నారు.తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు 40వేలకోట్లతోనే పూర్తయ్యేదన్నారు.

మేడిగడ్డకు మార్చటం ద్వారా ప్రాజెక్టు వ్యయం మూడు రెట్లు పెరిగి 1.2లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. మేడిగడ్డ డిజైన్లు పెట్టుబడులకు సిడబ్ల్యుసి ఆమోదించలేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు పెట్టుబడులకు కూడా సిడబ్యుసి క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2టిఎంసీలు 96రోజుల పాటు మొత్తం 195టిఎంసీలు ఎత్తిపోసి 18.25లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిందించాలని ప్లాన్ చేసిందన్నారు. అదనంగా 3వ టిఎంసీ వల్ల నీటినిల్వ లేదని , ఆయకట్టు పెరిగేది లేదని, కాని దీని ద్వారా ప్రాజెక్టు ఖర్చు మాత్రం 30వేలకోట్లు పెరిగిందన్నారు. ఈ ఖర్చు సమర్థనీయం కాదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయాన్ని తక్కువ చేసి చూపుతు పంట దిగుబడి ఎక్కువ చేసి చూపి కాళేశ్వరం అన్ని విధాల లాభదాయకం అని తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఒక్కో ఎకరాలో 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుదని తెలిపారన్నారు. ప్రాజెక్టుపైన రూపాయి ఖర్చు చేస్తే రూపాయిన్నర తిరిగి వస్తేనే ఆ ప్రాజెక్టు లాభదాయకం అని, అందుకే ఈ ప్రాజెక్టు కింద ఎకరాకు 120క్వింటాళ్ల దిగుబడి అని తప్పుదోవ పట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించిందనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయ నివేదిక అనుమతిని పట్టించుకోలేదని తెలిపారు.

ఏ బ్యాంకు అయినా తీసుకున్న రుణం ఏలా చెల్లిస్తారనే అర్హతను చూసాకే రుణం ఇస్తుందని , అదే విధంగా గత ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించి తాగునీటిని విక్రయించి ప్రజల నుంచి ఏటా రూ.1200కోట్లు వసూలు చేస్తుందని, సాగునీటికి కూడా రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తామని బ్యాంకులకు రిపోర్టు ఇచ్చి రుణ తెచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తప్పుడు నివేదికలు తెలుకున్న కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు అసలు విషయం తెలపటం వల్లే 3వ టిఎంసీకి ఆర్‌ఇసి రుణం నిలిపివేశారని వెల్లడించారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత తనిఖీ చేసేందుకు థర్డ్‌పార్టీని నియమించకపోవటం కూడా తప్పిదమే అన్నారు.వివిధ దశల్లో పనులకు సంబంధించిన కంప్లీషన్ రిపోర్టులు తీసుకోలేదని తెలిపారు.

మేడిగడ్డకు ప్రత్యామ్నాయం ఇవే :
కుంగిపోయన మేడిగడ్డ బ్యారేజికి ప్రత్యామ్నాయాలను కూడా సూచించారు. డ్యామ్‌సేఫ్ట్టీ అథారిటీ కమిటీ ఇచ్చే నివేదికలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుందన్నారు. ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద 152మీటర్ల స్థాయిలో బ్యారేజి , లేదా ఇచ్చంపల్లి బ్యారేజినుంచి గోదావరి బ్యాక్ వాటర్‌ను ఉపయోగించటం , లేదా కాళేశ్వరంలోనే 100టిఎంసీల నీల్వ స్థాయి ప్రాజెక్టు నిర్మించటం ప్రత్యామ్నాయాలుగా సూచించారు. కమిటీ నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజి కూలిన వెంటనే కేంద్ర ప్రభుత్వం డ్యామ్‌సేష్టి అథారిటీ రాష్ట్రానికి పంపిందన్నారు. అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కమిటి కోరినా సమాచారం ఇవ్వలేదన్నారు. కనీసం ఇప్పుడు వున్నకాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతవరకూ సమాచారం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం సరైన విధానం కాదన్నారు.

ప్రమాదంలో శ్రీశైలం, నాగార్జున సాగర్
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ప్రమాదంలో ఉన్నట్టు డ్యామ్‌సేఫ్ట్టీ అథారిటీ నివేదికలు చెబుతున్నట్టు వెల్లడించారు. తక్షణం ఈ ప్రాజెక్టులకు రిపేర్లు చేపట్టాల్సింవుందన్నారు. రెండు ప్రాజెక్టుల నివేదికలోని అంశాలు వివరించారు.
కృష్ణానీటి రీఅలకేషన్ కోసమే కొత్తగా గెజిట్ తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీజలాలను రీఅలకేషన్ చేసేందుకే బ్రజేష్ ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇస్తూ గెజిట్ జారీ చేసిందన్నారు. 2014కు ముందు రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని అనాటి కేంద్రంలో ఉన్న యూపిఏ ప్రభుత్వమే రూపొందించిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయని తెలిపారు. నదీజలాల్లో ట్రిబ్యునల్ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని సక్రమంగా ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకే బోర్డులు ఏర్పాటయినట్టు తెలిపారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలన్నది కూడా అప్పటి యూపిఏ ప్రభుత్వం రూపొందించిన ఆపరేషన్‌ప్రోటోకాల్ నిబంధనలో భాగమే అని తెలిపారు.

కృష్ణాజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811టిఎంసీల నీటిలో ఏపికి 512, తెలంగాణకు 299టిఎంసీలకు అపెక్స్ కౌన్సిల్‌లో అప్పటి తెలంగాణ సీఎం కేసిఆర్ అంగీకారం తెలిపారని వెల్లడించారు. తెలంగాణకు నీటిలో అన్యాయం జరిగిందనే రాష్ట్రం తెచ్చుకున్నట్టు తెలిపారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు 50శాతం నీటి వాటా కావాలంటే ఇపుడున్న ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించుకోవటమే మార్గం అన్నారు. అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విభజన చట్టం మేరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాల్సివుండగా తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రంపైన పక్షపాతం ఉండదన్నారు. పాలమూరురంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు,డిండి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని తెలిపారు. 65శాతం డిపెండబులిటి ద్వారా వచ్చే 1005టిఎంసీలనుంచి ఈ ప్రాజెక్టులకు నీటికేటాయింపులు సాధించుకోవాలని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News