Wednesday, January 22, 2025

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట: విద్యుత్ శాఖ అధికారు లు నిర్లక్షంతో విద్యుత్ తీగలు నేలకు తాకుతూ చెట్ల కొమ్మల గుండా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వా పోతున్నారు. మండలంలోని ఉంద్యాల గ్రామంలో 2వ వార్డు లో రోడ్డుకు అంచున ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలు కిం దికి వేలాడుతున్నా కరెంటు తీగలు చెట్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష ధోరణి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ షాక్‌కు గురై ఎంతో మంది చనిపోతున్న విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడం లేదు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అప్పుడు అ ప్పుడు మెరుపులు వస్తున్నాయి. దీంతో ప్రజలకు పశువుల ప్రా ణాలకు ముప్పు పొంచి ఉంది చేతి కందేలా కరెంటు తీగలు ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్ర మాదం సంభవించిన తర్వాత దిద్దుబాటు చర్యలకు లేదా ఎక్స్ గ్రేషియా ప్రకటించడం కన్నా నివారణ చర్యలు చేపట్టడం మం చిది అంటున్నారు.

వర్షాకాలంలో రోడ్డు పక్కన విద్యుత్ ట్రా న్స్‌ఫార్మర్ కింద భాగంలో ఉండటంతో ఎప్పుడు ఏమి జరు గుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెం టనే విద్యుత్‌శాఖ అధికారులు ట్రాన్సారం చుట్టూ కంచె ఏ ర్పాటు చేసి దాని ఎత్తు పెంచాలని తెలిపారు. విద్యుత్ శాఖ అ ధికారులు బిల్లులు వసూలుపై ఉన్న శ్రద్ద సమస్యలు పరి ష్కరి ంచడంలో లేదని గ్రామ ప్రజలు మండి పడుతున్నారు. వెంటనే విద్యుత్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News