నిర్మల్: చేతులెత్తేయ లేదని, కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు మించి వస్తుంటే వరదలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి డిజాస్టర్ సిబ్బంది సిద్ధపడటం తప్ప వేరే మార్గం లేదని ఇంజనీర్లు తెలిపారు. ఈ పరిస్థితి 1995 లో కూడా ఎదురైందని ఇంజనీర్లు చెప్పారు. చిన్నపాటి డ్యామేజ్ తో ఆనాడు ప్రమాదం నుంచి బయటపడినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. ఇది అసాధారణ పరిస్థితి అని, మానవ కృషికి అందని స్థాయిలో ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇంజనీర్లు, జిల్లా యంత్రాంగం తెలిపారు. అంత ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజనీర్లు గేజింగ్ రూమ్ లో ఉండి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వారు అత్యంత సాహసంతో , ధైర్యంతో ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎస్ఇ సుశీల్ కుమార్, ఇఇ రాజశేఖర్, సహచర ఇంజనీర్లు, సిబ్బంది అందరూ అభినందనీయులని ప్రశంసించారు.