Monday, January 20, 2025

పెద్ద వాగు బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా గుంతలు

- Advertisement -
- Advertisement -

సంగెం: మండల కేంద్రంలోని పెద్ద వాగు బ్రిడ్జి వద్ద గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనదారులు, ప్రయాణికులు పనుల నిమిత్తం సంగెం నుంచి వరంగల్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు రోజు పెద్ద పెద్ద కంటైనర్ వాహనాలు, టిప్పర్ లారీలు నిత్యం మట్టిని తీసుకెలుతుంటాయి. దీంతో ఈ రోడ్డుపై రద్ది పెరుగుతుంది. గుంతల రోడ్డుతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షకాలంలో పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పకైనా ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రమాదాలు జరగక ముందే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయించాలని వాహనదారులు, బాటసారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News