Wednesday, January 22, 2025

ఆకతాయిల హల్‌చల్.. కేబుల్ బ్రిడ్జిపై బైక్‌లపై ప్రమాదకర స్టంట్స్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు నగరంలోని పలుప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు సోమవారం రాత్రి యువతులతో కలిసి ప్రమాదకరమైన స్థితిలో స్టంట్స్ చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, అత్తాపూర్, కేబుల్ బ్రిడ్జి ప్రాంతాల్లో బైక్‌లపై స్టంట్స్ చేశారు. చాలామంది యువకులు ఇన్‌స్టాగ్రాంలో పాపులర్ అయ్యేందుకు వీటిని చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News