Friday, November 15, 2024

డెల్టా చికెన్‌పాక్స్ కన్నా డేంజర్

- Advertisement -
- Advertisement -

Dangerous than Covid Delta Chickenpox

టీకా ఛేదించుకుని ఇమ్యూనిటిపై దాడి
అమెరికాలో తిరిగి కరోనాకల్లోల కారణభూతం
సిడిసి అధ్యయనంలో పలు కీలక అంశాలు
కోవిడ్ కణాల కన్నా వేయి రెట్లు బలీయం

న్యూయార్క్: కరోనా వైరస్‌కు తోకలా పుట్టుకొచ్చిన డెల్టా వేరియంట్ మనుష్యులలో మశూచీ లేదా చికెన్‌పాక్స్ వోలే వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఇతర రూపాలతో పోలిస్తే తీవ్రస్థాయిలో వ్యాధికి గురిచేస్తుంది. అమెరికా ఆరోగ్య అధికారిక వ్యవస్థల అంతర్గత పత్రాలను ఆధారంగా తీసుకుని దీనికి సంబంధించి అమెరికా పత్రికలలో వార్తలు వెలువడ్డాయి. కరోనా వైరస్ తీవ్రస్థాయికి ప్రతీకగా ఇప్పుడు డెల్టా వేరియంటు పలు దేశాలలో అనారోగ్య అత్యయిక స్థితిని కల్పించింది. ఈ దశలో ఈ వేరియంటు లక్షణాలపై సర్వత్రా అధ్యయనం జరుగుతోంది. ఇతర కరోనా వైరస్‌లతో పోలిస్తే డెల్టా వేరియంటు తీవ్రప్రభావశాలి అయింది. ఇతరత్రా కరోనా వైరస్ రకాలతో పోలిస్తే దీని ప్రభావానికి గురైన వ్యక్తిలో వేయి రెట్లు అధిక వైరస్ లోడ్ ఉంటుంది. ఆరోగ్య విభాగానికి చెందిన అంటువ్యాధుల నిరోధక నియంత్రణ కేంద్రం (సిడిసి) అంతర్గత పత్రాల ప్రాతిపదికన ఇప్పుడు డెల్టా తీవ్రతాంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇండియాలో డెల్టా వేరియంటు తొలి సారి ఉనికిలోకి వచ్చింది. పూర్తి స్థాయిలో టీకాలు వేసుకున్న వారు కూడా ఈ వేరియంటుకు గురి కావడమే కాకుండా వేగవంతంగా ఇతరులకు వ్యాప్తికి కారణంఅవుతున్నారని తేల్చారు. వ్యాక్సిన్‌లు పొందిన వారిలో పొందని వారిలో కూడా సమాన స్థాయిలో డెల్టా వేరియంటు వ్యాపిస్తోందని వాషింగ్టన్ పోస్టు పత్రిక వార్తాకథనం వెలువరించింది. డెల్టా వేరియంటు ఎక్కువగా ముక్కు, గొంతు ద్వారా సోకుతోంది. సిడిసి డైరెక్టర్ డాక్టర్ రోచెల్లే పి వాలెంస్కీ ఈ వేరియంటు రోగనిరోధక శక్తిని కూడా చీల్చుకుంటూ వెళ్లుతుందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్లు పొందిన వారిలో కూడా ఇది వ్యాక్సిన్లు పొందని వారితో సమానంగా వ్యాపిస్తోందని, దీనిని బట్టి ఈ డెల్టా వేరియంటు ఎంతటి బలీయం అనేది తెలుసుకోవచ్చునని తెలిపారు. అయితే వ్యాక్సిన్లు వేసుకున్న వారి ద్వారా ఇతరులకు అతి తక్కువగా ఇది సోకుతోందని వెల్లడించారు. సాధారణ జలుబు, సార్స్, మెర్స్, మశూచి , ఫ్లూ వంటి వాటి కన్నా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. చికెన్‌పాక్స్‌తో సమానంగా ప్రమాదకారి అవుతోందని తెలిపారు. సిడిసి రూపొందించిన డాక్యుమెంట్ వివరాలను న్యూయార్క్ టైమ్స్ సమగ్రంగా ప్రచురించింది. ముందుగా డెల్టా వేరియంటును బి 1.617.2గా వ్యవహరించారు. డెల్టా వేరియంటు జన్యుకణాలలోని స్వరూపం యుద్ధ వ్యవస్థను పోలి ఉంటోంది. తాను ప్రవేశించిన శరీరాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో దెబ్బతీయాలనే ప్రక్రియను సంతరించుకుని ఉంది. కరోనా వైరస్‌లలోని యుద్ధ స్వరూపపు మార్పులు చేర్పులను మరింతగా అధ్యయనం చేయాల్సి ఉందని సిడిసి తెలిపింది.

డెల్టాతో అమెరికాలో కలకలం

ఇప్పటికే డెల్టా కరోనా వైరస్‌తో అమెరికాలో ఆరోగ్యపరమైన కలవరం కలకలం చెలరేగింది. సిడిసి సైంటిస్టులు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వీరు సాగించిన పరిశోధనలలో దీనికి అత్యంత శక్తివంతమైన అంటు లక్షణం ఉండటంతో, పైగా టీకాలను కూడా లెక్కచేయకుండా ఇది తీవ్రస్థాయిలో వ్యాపిస్తూ ఉండటంతో అమెరికాలో ఇటీవలి కాలంలో ఓ కొలిక్కి వచ్చిన ఆరోగ్య సమీకరణలు తిరిగి వికటిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భయానక వేరియంటు గురించి సిడిసి అదనపు విశ్లేషణాత్మక పత్రాన్ని వెలువరిస్తుంది. డెల్టా తీవ్ర స్థాయి ముప్పు నేపథ్యంలో మరింతగా నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.

టీకాలు పొందిన వారిలో డెల్టా లక్షణాలు

అమెరికాలో 16 కోట్ల మందికి పైగా ఇప్పటివరకూటీకాలు తీసుకున్నారు. అయితే వీరిలో వారం వారం దాదాపు 35000 మందికి కరోనా లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇక లక్షణాలు లేకుండా వైరస్ తలెత్తిన వారు అత్యధికులే ఉన్నారని తేలింది. ఈ నెల 24వ తేదీ నాటికి సేకరించిన డాటా ప్రాతిపదికన ఈ లెక్కలు చూపారు. అయితే లక్షణాలు లేకుండా ఇటీవలి కాలంలో ఎందరికి కరోనా సోకింది. వీరిలో ఎందరు టీకాలు పొందిన వారున్నారు? అనేఅంశాలు స్పష్టం కాలేదు. ఇక ఇప్పటికీ అందిన సమాచారం మేరకు అత్యధికులు డెల్టాతో సతమతమవుతున్నారు.

ఇటీవలి కాలంలో జులైలో జరిగిన ఉత్సవాలు , జనసమ్మర్థ కార్యక్రమాల దశలో ప్రొవిన్స్‌టౌన్, మెసాచూసెట్స్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది, సందర్శకులు అంతా కూడా విధిగా ఎప్పుడూ మాస్క్‌లు పెట్టుకుని ఉండాలని సిడిసి డైరెక్టర్ సూచించారు. వచ్చింది తీవ్రస్థాయి వేరియంటు, మన జాగ్రత్త చర్యలు కూడా ఇంతకు ముందు కన్నా బలంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్లతో డెల్టా వేరియంటు సంక్రమణం 90 శాతం తగ్గుతుంది. అయితే టీకాలు వేసుకున్న వారిపై కూడా ఇది ప్రభావం చూపడం, సంక్రమణల శాతం పెరగడం కీలక అంశాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News