Thursday, January 23, 2025

వయాగ్రా అంత డేంజరా ? ఎవరిపడితే వారు వాడకూడదు

- Advertisement -
- Advertisement -

శృంగారంలో రెచ్చిపోవాలని అంగస్తంభన త్వరగా జరగకుండా ఉండాలని చాలా మంది వయాగ్రా పిల్స్ వాడుతుంటారు. ఒక్కోసారి వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. వయాగ్రా అందరూ వాడకూడదని, కేవలం అంగస్తంభన సమస్యలు ఉన్నవారు మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శృంగారంలో పాల్గొనేంత సమర్ధత లేని వాళ్లు కూడా దీన్ని వాడకూడదు. దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వయాగ్రా పిల్స్ … పురుషాంగం లోని రక్తనాళాలను రిలాక్స్ చేసి , రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీన్ని ఎప్పుడుపడితే అప్పుడు వేసుకోకూడదు. శృంగారంలో పాల్గొనాలని అనుకున్న సమయానికి గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని పనితీరు బాగుంటుందని చెబుతున్నారు. దీన్ని ఆహారంలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. కానీ ద్రాక్షరసంలో మాత్రం కలిపి తీసుకోకూడదు. శృంగారం అయిపోయిన తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదని నిపుణుల పరిశోధనలో తేలింది. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలని , అది కూడా 50 ఎంజికి మించరాదని సూచిస్తున్నారు.

ఇది చాలా ప్రమాదకరమైనది కాకపోయినా కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఇక గుండె జబ్బులు ఉండి కొన్ని రకాల మందులు తీసుకునే వారిలో మాత్రం ఇది ప్రమాదకరంగా పరిగణించవచ్చు. అంతేకాదు.. సెక్స్ ప్రేరేపిత మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టపరంగా నేరం. సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచిస్తే తలనొప్పి, మత్తుగా ఉండటం, చూపు అస్పష్టంగా మారడం, కొందరికి దృశ్యాలు నీలిరంగులో కనిపించవచ్చు. మొహం వేడెక్కడం, ఎర్రబారటం , ముక్కుదిబ్బడ, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పిట్స్‌రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మొహం, కనురెప్పలు వాయడం కూడా జరుగుతుంటాయి.

ఇతర మందులతో కలిపి తీసుకునేటప్పుడు జాగ్రత్తలు
గుండెపోటుకు నైట్రేట్ పిల్స్ తీసుకునేవారు వయాగ్రా కనెక్ట్ తీసుకోకూడదు. అలాగే అమిల్ నైట్రేట్ తీసుకునేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. రయోసిగువట్, రిటోనేవిర్ అనే ఔషధాలు వాడే వారు కూడా వయాగ్రా తీసుకోరాదు. ఏదైనా చికిత్స పొందుతుంటే దాని గురించి ఫార్మాసిస్టులకు చెప్పిన తరువాత వయాగ్రా వాడొచ్చా లేదా అని తెలుసుకోవాలి. హైబీపీ, హైసుగర్ , కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వయాగ్రా వాడితే ప్రాణాలకే ముప్పు అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వయాగ్రా వాడుతుంటారు. ఇక ఈ టాబ్లెట్లకి జనరిక్ వెర్షన్ ధర తక్కువ. అదే ఎఫెక్ట్. వయాగ్రా వాడకంలో సైడ్ ఎఫెక్ట్ కొత్తవి బయటపడుతుంటాయి. అందుకే వయాగ్రాకి medicines and healthcare products agency ఎల్లోకార్డు ఇచ్చింది. అంటే వయాగ్రాను వినియోగిస్తున్న రోగులు కానీ, మరెవరైనా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా రిపోర్టు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News