Sunday, December 22, 2024

గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ(48) క‌న్నుమూశారు. దీంతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన డేనియ‌ల్ బాలాజీని కుటుంబ‌స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

కాగా, డేనియ‌ల్ బాలాజీ త‌మిళంతోపాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ సినిమాలలో కూడా నటించారు. ఆయన ఎక్కువ‌గా విల‌న్ రోల్స్‌లోనే నటించారు. తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్‌ జగదీశ్ వంటి సినిమాల్లో ఆయన నటించారు. చివ‌రిసారిగా అరియ‌వాన్ అనే త‌మిళ సినిమాలో డేనియ‌ల్ బాలాజీ క‌నిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News