Sunday, January 19, 2025

పాలస్తీనా శాంతి దూతలకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇప్రాలస్తీనా యుద్ధంపై అహింసాయుత పరిష్కారం కోసం కృషి చేస్తున్న దానియల్ బారెన్‌బిమ్, అలీ అబు అవ్వద్‌కు సంయుక్తంగా 2023 సంవత్సరానికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది. అర్జెంటీనాలో జన్మించిన బారెన్‌బిమ్ ప్రముఖ క్లాసికల్ పియానో కళాకారుడు కాగా అస్పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతియుత పరిష్కారం కోసం పాలస్తీనా ప్రజలతో కలసి పనిచేస్తున్న శాంతి కార్యకర్త. వీరిద్దరినీ ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు ఇందిరా గాంధీ స్మారక ట్రస్టు గురువారం ప్రకటించింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అధ్యక్షతలోని అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల బృందం ఈ బహుమతిని తమ వీరిద్దరికీ ప్రకటించింది. ఇజ్రాయెలీ, పాలస్తీనా మధ్య సామరస్యం కోసం అవిశ్రాతంగా కృషి చేస్తూ తమ జీవితాలను అంకితం చేసిన వీరిద్దరినీ శాంతి యోదులుగా జ్యూరీ అభివర్ణించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News