Sunday, December 22, 2024

AptaGrowను ప్రారంభించిన డానోన్ ఇండియా

- Advertisement -
- Advertisement -

‘సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న, డానోన్ ఇండియా, పసిపిల్లల పోషకాహార పరిధిని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తూ ఆప్టాగ్రో ను జాతీయ స్థాయిలో విడుదల చేసింది. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల పోషకాహార అవసరాన్ని 37 పోషకాలతో ఆప్టాగ్రో తీరుస్తుంది, ఇది ప్రీబయోటిక్స్ యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, ఇది పిల్లల ఎదుగుదల, మెదడు అభివృద్ధి మరియు రోగనిరోధక శక్తిని అందించడానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

ఆప్టాగ్రోలో 100% మిల్క్ ప్రొటీన్, కాల్షియం వున్నాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఇవి మద్దతు అందిస్తాయి, విటమిన్ ఎ, సి, డిలు రోగనిరోధక ఆరోగ్యానికి మద్దతు అందిస్తే డిహెచ్ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ & అయోడిన్ మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి, అయితే ప్రీబయోటిక్స్ యొక్క ప్రత్యేకమైన మిశ్రమం అవసరమైన పోషకాలను శోషించడానికి మద్దతు ఇస్తుంది. ఈ లో-ఫ్యాట్, చాక్లెట్/వనిల్లా రుచిగల పానీయం పిల్లలలో ఆరోగ్యకరమైన పెరుగుదల, మొత్తం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆదర్శవంతమైన ఎంపికగా పనిచేస్తుంది.

ఆప్టాగ్రో, ముఖ్యంగా పిల్లల ఎదుగుదల సంవత్సరాలలో, తగినంత పోషకాహారాన్ని అందించడం, ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి డానోన్ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీరామ్ పద్మనాభన్ మాట్లాడుతూ, “డానోన్‌లో, వీలైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలని మేము విశ్వసిస్తున్నాము. పిల్లల ఎదుగుదలకు సంబంధించి ఆరంభ సంవత్సరాల్లో సరైన పునాదిని కలిగి ఉండటం ముఖ్యం. తల్లులందరూ తమ పిల్లలకు ఉత్తమమైన పోషకాహారాన్ని అందించాలని తహతహలాడుతున్నప్పటికీ, పోషకాహారం బాగా గ్రహించడం చాలా ముఖ్యం. ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా, 69% మంది తల్లులు తమ పిల్లలు ఆశించిన విధంగా ఎదగడం లేదని భావించారు. 73% మంది పోషకాలను సరిగా గ్రహించ లేక పోవడం వల్ల ఎదుగుదల సరిగా ఉండటం లేదని నమ్ముతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మేము శాస్త్రీయంగా రూపొందించిన ఆప్టాగ్రోను విడుదల చేస్తున్నాము. ఇది 37 ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది, ఇది ప్రీబయోటిక్స్, ప్రత్యేకమైన మిశ్రమాన్ని కలిగి ఉంటుంది, ఇది పోషకాలను గ్రహించడంలో తోడ్పడటంతో పాటుగా పిల్లల పెరుగుదల అవసరాలకు తోడ్పడుతుంది” అని అన్నారు.

ఈ బ్రాండ్ తన పిల్లల సంపూర్ణ ఎదుగుదలను అర్థం చేసుకోవడం మరియు వారి అవసరాలను కొలిచేందుకు తల్లులకు సహాయపడేందుకు, మొదటి సారిగా వినూత్నమైన సాధనం – ఆప్టాగ్రో గ్రోత్ చక్రను బ్రాండ్ పరిచయం చేసింది. ఈ సాధనం పిల్లల ఎత్తు, బరువు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధి, మొత్తం శ్రేయస్సును కూడా కొలుస్తుంది. ఉచిత వ్యక్తిగతీకరించిన ఆహార ప్రణాళిక సహా నిర్దిష్ట వృద్ధి అవసరాలను తీర్చడానికి తల్లులకు అందించబడుతుంది.

ఆరోగ్యకరమైన భారతదేశాన్ని పెంపొందించడంలో తమ మిషన్‌లో చేరాలని తల్లిదండ్రులు, సంరక్షకులు, భాగస్వాములను డానోన్ ఆహ్వానిస్తుంది. దాని సమగ్ర విధానంతో, తగినంత పోషకాహార అవసరాలను అందించడానికి కంపెనీ దేశంలోని ప్రతి బిడ్డకు అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది, పిల్లల ఎదుగుదల సంవత్సరాల్లో అవసరమైన పోషకాహారాన్ని పొందడంలో ఏ బిడ్డ కూడా వెనుకబడి ఉండకుండా చూసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News