Saturday, November 23, 2024

పాత ధరలకే రైతుకు ఎరువు

- Advertisement -
- Advertisement -

డిఎపి సబ్సిడీ రూ 700 పెంపు
మొత్తం సబ్సిడీ విలువ రూ 1200
కేంద్ర మంత్రిమండలి నిర్ణయం

న్యూఢిల్లీ : డిఎపి ఎరువుల ధరలలో సబ్సిడీని బస్తాకు రూ 700 వరకూ పెంచారు. దీనికి సంబంధించిన నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సబ్సిడీ పెంపుదలతో ప్రభుత్వ ఖజానాకు రూ 14,475 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం ఆరంభం అయింది. రైతులు దుక్కులు దున్నే దశలో వారికి భూసారపు ఎరువులు సరైన అందే దిశలో చర్యలు తీసుకోవాలని కేంద్రం సంకల్పించింది. అంతర్జాతీయ స్థాయిలో ఎరువులు సంబంధిత ధరలు పెరుగుతూ ఉన్నా, దేశంలో వీటిని పాత రేట్లకు విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో డై అమ్మోనియం ఫాస్పేట్ (డిఎపి) ఎరువులను రైతులు విస్తారంగా వాడుతారు. డిఎపి ఎరువులకు సిబ్సిడీని 140 శాతం పెంచాలని గత నెలలోనే కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు దీనికి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిందని ఆ తరువాత కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా విలేకరులకు తెలిపారు. డిఎపిపై రైతులకు ఇచ్చే సబ్సిడీ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒక బస్తాలో 50 కిలోల ఎరువు ఉం టుంది. ఇంతకు ముందు సబ్సిడీ రూ 500 వరకూ ఉండేది. ఇప్పు డు సబ్సిడీని రూ 700 పెంచారని, దీనితో బస్తాపై సబ్సిడీ రూ 1200 అయిందని, సబ్సిడీ పెంపుదలతో ప్రభుత్వంపై పడే భారం దాదాపు రూ 15వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి చెప్పారు. త ఏడాది డిఎపి ఎరువు బస్తా నికర ధర రూ 1700గా ఉండేది. ఇందులో ప్రభుత్వం నుంచి రూ 500 రాయితీ దక్కేది. దీనితో ఈ ఎరువును కంపెనీలు రైతులకు రూ 1200గా విక్రయించారు. అయితే పలు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా డిఎపి వాస్తవిక ధర రెండింతలు అయి బస్తాకు రూ 2400 అయింది. అయితే రైతులకు పాత ధరలకే బస్తా డిఎపి దొరికేందుకు వీలుగా బస్తాకు రూ 1200 (ఇంతకు ముందటి రూ 500, ఇప్పటి రూ 700) ఖరారు చేశారు. దీనితో రైతులు బస్తా ఎరువును రూ 1200కు పొందేందుకు వీలుంటుంది. అయితే యూరియాకు సంబంధించి గరిష్ట టోకు ధరను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే సబ్సిడీ రేట్లు మారుతూ ఉంటాయి. సగటున యూరియాపై బస్తాకు కేంద్రం రూ 900 వరకూ సబ్సిడీని అందిస్తోంది. అయితే యూరియాయేతర ఎరువులకు సంబంధించి సబ్సిడీని ప్రభుత్వం నిర్థిష్టంగా ఖరారు చేసిందని మంత్రి వివరించారు.
సముద్ర గర్భ అన్వేషణకు రూ 4,077 కోట్లు
సముద్రపు అట్టడుగుపొరలలోని వనరులను అన్వేషించేందుకు రూపొందించిన డీప్ ఒషియన్ మిషన్‌కు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. వనరులను పసిగట్టడం, దీనికి సంబంధించి సముద్ర అంతర్భాగ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. సముద్ర వనరులను విరివిగా వాడుకునేందుకు ఈ మిషన్‌ను రూపొందించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. సముద్ర జలాల వనరులకు సంబంధించిన నీలి ఆర్థిక వ్యవస్థను సరిగ్గా కాపాడుకోవడం, సరైన మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌ను మరింతగా ప్రగతిదాయక అధ్యాయంలోకి తీసుకుని పోవడం జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సము ద్ర అంతర్భాగాలలోని అపార జీవవైవిధ్యంపై మరింతగా అధ్యయనాలు జరుగుతాయని తెలిపారు. డీప్ ఓషియన్ మిషన్ రూపకల్పన ప్రతిపాదన భూ సంబంధిత శాస్త్ర వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి వెలువడిందని జవదేకర్ వివరించారు. రూ 4,077 కోట్ల వ్యయ అంచనాలతో కూడిన ఈ మిషన్ ఐదేళ్ల వరకూ అమలులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News