- Advertisement -
పాట్నా: బీహార్‌లోని దర్భంగాలో పేలుళ్లకు హైదరాబాద్ నుంచే కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఎ గుర్తించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్ అనే వ్యక్తులు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ బట్టల దుకాణం నడుపుతున్నారు. కొన్ని చీరల మధ్య ఒక బాటిల్‌ను అమర్చారు. జూన్ 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దర్భంగాకు పార్సిల్ వెళ్లింది. జూన్ 17న దర్భంగా రైల్వే స్టేషన్‌లో ఈ సీసా పేలింది. ఈ పేలుళ్లలో ఎవరు గాయపడలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌లో సిసి టివి దృశ్యాలు రికార్డయ్యాయి. రైళ్లలో పేలుడుకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఎ అనుమానం వ్యక్తం చేసింది. ఎన్‌ఐఎ అధికారులు ఇమ్రాన్, నాసిర్‌లను ఢిల్లీకి తీసుకెళ్లారు. యుపిలో మరో ఇద్దరిని ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని ఎన్‌ఐఎ తెలిపింది.
- Advertisement -