Wednesday, January 22, 2025

సినిమా ‘దర్జా’గా ఆడాలి..

- Advertisement -
- Advertisement -

కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కెఎల్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఈ ఫస్ట్ లుక్ ‘దర్జా’గా ఉంది. ఈ సినిమా కూడా దర్జాగా ఆడి అందరికీ మంచి పేరు తీసుకురావాలి”అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం. సునీల్, అనసూయ అద్భుతంగా నటించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామినేని శ్రీనివాస్, కెఎల్ నారాయణ, సునీల్, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.

Darjha Movie First look poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News