Monday, December 23, 2024

‘దర్జా’గా సినిమా చూడండి

- Advertisement -
- Advertisement -

కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేసి.. చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనసూయ, బుచ్చిబాబు, సందీప్ మాధవ్, వీరశంకర్, ఉత్తేజ్, చిట్టిబాబు, నాగమహేష్, షఫీ, కుమనన్ సేతురామన్, వెంపక శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ “దర్జా అంటే రాయల్టీ. స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. ఈ నెల 22న థియేటర్లకి వెళ్లి ‘దర్జా’గా ఈ సినిమా చూడండి” అని అన్నారు. అనసూయ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి” అని పేర్కొన్నారు.

DARJA Movie Pre Release Event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News