Thursday, December 5, 2024

లవ్, ఫ్యామిలీ డ్రామా.

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ’డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ కథ చెప్పినప్పుడు -స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా నచ్చింది. ఇది చాలా ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ చేయలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ వున్న ఈ పాత్రని పర్ఫార్మ్ చేయడం చాలా ఛాలెజింగ్‌గా అనిపించింది. కామెడీ, లవ్ స్టొరీ ఎంటర్‌టైనర్‌లో ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

-డార్లింగ్ ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ వున్న పూర్తి ఎంటర్‌టైనర్. ప్రియదర్శి తో కలిసి వర్క్ చేయడం చాలా బావుంది. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. తన కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. -అశ్విన్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తను ఈ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనిపించింది. -వివేక్ సాగర్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. నా కెరీర్‌లో ఫస్ట్ టైం సోలో ట్రాక్ డార్లింగ్‌లో దొరికింది. ఈ పాట అద్భుతంగా వచ్చింది. అలాగే ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం కూడా అద్భుతంగా చేశారు. ఇక ప్రస్తుతం -’స్వయంభూ’తో పాటు మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News