Friday, August 30, 2024

కావాల్సినంత కామెడీ, మంచి మ్యూజిక్..

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ’డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అది చాలా అద్భుతంగా…

డార్లింగ్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ వుంటుంది. దీన్ని చూపించిన తీరు చాలా వైవిధ్యంగా వుంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్‌గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్‌లో అది చాలా అద్భుతంగా చూపించడం జరిగింది.

స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా..

నభా నటేష్‌లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్‌గా వుందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటాయి.

క్లియర్ విజన్ వున్న దర్శకుడు…

ఇక సందీప్ కిషన్ ’ఏ వన్ ఎక్స్ ప్రెస్’ షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం అశ్విన్ ని కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్, కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ వున్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. నిర్మాతలు నిరంజన్, చైతన్య ట్రూ డార్లింగ్స్. మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

ఆ క్రెడిట్ అంతా వారికే..

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్‌కి ఇది 25వ సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక సినిమాలో నేను డ్యాన్సులు చేసిన క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీకి దక్కుతుంది.

మంచి అనుభూతినిచ్చే సినిమా..

డార్లింగ్ సినిమాలో కావాల్సినంత కామెడీ వుంది, మంచి మ్యూజిక్ వుంది. డార్లింగ్ తప్పకుండా ఆడియన్స్‌కి మంచి అనుభూతినిస్తుంది. దీన్ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ థియేటర్స్‌కి రావాలని కోరుకుంటున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News