Monday, December 23, 2024

ప్రభాస్, మారుతి కాంబో మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అప్పుడే

- Advertisement -
- Advertisement -

ఈ సంక్రాంతి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు రెట్టింపు సంతోషాన్ని తీసుకురాబోతోంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటిదాకా చూడని ఒక కొత్త లుక్ లో, క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ప్రభాస్ తో చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అప్డేట్ ను షేర్ చేసింది. డైనోసార్ డార్లింగ్ గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి. సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం. అంటూ ఈ సంస్థ ట్వీట్ చేసింది.

టాలీవుడ్ కు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి ప్రభాస్ ను సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ మూవీ ఇవ్వాలనే స్ట్రాంగ్ కన్విక్షన్ తో ఈ ప్రాజెక్ట్ కోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేస్తున్నారు మారుతి.

ప్రభాస్, మారుతి మూవీ రెగ్యులర్ షూటింగ్ లో ఉన్నా..ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News