- Advertisement -
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ’డార్లింగ్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి చేసుకుని తన భార్యతో పారిస్ కు వెళ్లాలనుకుంటాడు ప్రియదర్శి. ఈ క్రమంలో నభా నటేష్ ను పెళ్లి చేసుకుంటాడు ప్రియదర్శి. ఇక అప్పటినుంచి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటుంది. దీంతో తన భార్య ప్రవర్తన అర్థం కాకా ప్రియదర్శి నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ ను వదిలారు మేకర్స్.
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -