Wednesday, January 22, 2025

డారెన్‌ సమీ “ముకుట్‌’’ ఎందుకు ధరించాడు?

- Advertisement -
- Advertisement -

Darren Sammy wearing Mukut

పూర్వ వెస్ట్‌ఇండీస్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డారెన్‌ సమీకి ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడ ఆయనకు అశేష అభిమానులున్నారు. అతను భారతదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ను తన కెప్టెన్సీలో సాధించాడు. అంతేకాదు, తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా అతను భారతదేశంలోనే ఆడాడు. ఓ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌కు 2021లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడతను. అదే మరెన్నో ఆసక్తికరమైన క్యాంపెయిన్స్‌ అతని ముఖచిత్రంతో ప్రారంభం కావడానికీ కారణమయ్యాయి. స్పోర్ట్స్‌ను వేడుక చేసే ఎన్నో కంపెనీలతో భాగస్వామ్యం చేసుకున్న డారెన్‌, క్రికెట్‌తో అనుబంధం మాత్రం ఎన్నో రకాలుగా కొనసాగించాడు.

భారీ సిక్సర్లు సంధించడం, మనసులో ఉన్నది నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా ప్రాచుర్యం పొందిన డారెన్‌, ఇప్పుడు భారతీయునిలా కనిపించబోతున్నాడు. అతని గురించి ఇప్పుడు మరింత ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తోంది. అతను ఇప్పుడు ‘ముకుట్‌’ లేదంటే కిరీటం ధరించి మహరాజులా, మొహంలో చిరునవ్వు పులుముకుని కనిపిస్తున్నాడు. సెయింట్‌ లూసియా దీవుల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తొలి ఆటగానిగా ఖ్యాతి గడించిన డారెన్‌, వైవిధ్యమైన వ్యక్తిగా చిపరిచితులు. అందువల్ల అతను మరో నూతన గేమ్‌ప్లాన్‌తో వస్తే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కాకపోతే అతను ఈ కిరీటం ఎందుకు ధరించాడనే ఆసక్తి మాత్రం ఉంది. మనందరికీ తెలుసు, డారెన్‌ ఎప్పుడూ తనకు ఇండియా సెకండ్‌ హోమ్‌ అంటుంటాడని!. అలాగే అతను ఇక్కడ ఏమైనా సెకండ్‌ కెరీర్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాడా? బాలీవుడ్‌లో లేదంటే ఓటీటీలో ప్రవేశించబోతున్నాడా?.

Darren Sammy wearing Mukut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News