Wednesday, January 22, 2025

పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు

- Advertisement -
- Advertisement -

పాపులర్ కన్నడ నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో ప్రధాన అనుమానితులలో ఒకరైన పవిత్ర గౌడ నటునికి స్నేహితురాలు మాత్రమేనని, అతని భార్య కాదని దర్శన్ న్యాయవాది అనిల్ బాబు స్పష్టం చేశారు. 33 ఏళ్ల చిత్రదుర్గ వాసి రేణుకాస్వామిని హత్య చేశారనే ఆరోపణపై ఈ వారారంభంలో దర్శన్‌ను, పవిత్ర గౌడను, మరి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ బాబు ఒక టివి చానెల్‌తో మాట్లాడుతూ, ‘దర్శన్ తూగుదీపకు పవిత్ర గౌడ రెండవ భార్యగాని, భాగస్వామి గాని కాదని నిర్దంద్వంగా ఖండించారు.

విజయలక్ష్మి నటుడు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య అని, పవిత్ర గౌడ కేవలం సహ నటి, స్నేహితురాలు అని ఆయన చెప్పారు. దర్శన్‌కు రేణుకాస్వామితో ఏమాత్రం సంబంధం లేదని, హత్యలో ప్రమేయం లేదని కూడా అనిల్ బాబు స్పష్టం చేశారు. నేర స్థలం సమీపాన దర్శన్ కారులను చూపుతున్న సిసిటివి ఫుటేజ్ గురించి అనిల్ బాబు ప్రస్తావిస్తూ, నటుడు ఆ కారులో లేరని, అక్కడ అతను ఉన్నాడని నిరూపించే ఏ ఆధారాన్నీ పోలీసులు ఇవ్వలేదని అనిల్ బాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News