Saturday, December 21, 2024

అయోధ్యలో దర్శన్ డెస్టినేషన్స్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్ ‘దర్శన్ డెస్టినేషన్స్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అయోధ్యలో ఆలయం తెరవడానికి ముందు అపూర్వమైన ప్రయాణ విజృంభణ, ఆలయ పట్టణానికి వెళ్ళే ప్రముఖులు సందడి నేపథ్యంలో అయోధ్యను సందర్శించడానికి సీనియర్ సిటిజన్‌లకు 1008 కాంప్లిమెంటరీ విమాన టిక్కెట్‌లను అందించడం ద్వారా భక్తులకు భగవంతుని ఆశీర్వాదం కోసం క్లియర్‌ట్రిప్ తన వంతు కృషి చేస్తోంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

“దర్శన్ డెస్టినేషన్స్”కింద కొనసాగుతున్న ఇన్షియేటివ్ గా, క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ కూడా వివిధ మతపరమైన గమ్యస్థానాలకు విమానాలు, హోటళ్లు & బస్సులలో ప్రత్యేక ఛార్జీలను ప్రారంభిస్తున్నాయి. అయోధ్య, మదురై, తిరుపతి, అమృత్‌సర్, భోపాల్, షిర్డీ, బోధగయ, కొచ్చి, కత్రా (జమ్మూ)తో సహా భారతదేశంలోని కొన్ని పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానాలకు ప్రయాణికులు బస్సు, హోటల్, విమాన బుకిం గ్‌లపై 20% తగ్గింపును పొందవచ్చు. ఈ ఇన్షియేటివ్ విమానాలు, హోటళ్లు & బస్సులలో భక్తులకు తగ్గింపు ధరలను అందించడానికి రూపుదిద్దుకుంటున్న ప్రతిపాదన.

అయోధ్య ద్వారా పురోగమిస్తున్న ఆధ్యాత్మిక పర్యాటకంలో ఇటీవలి పెరుగుదల, యాత్రికుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌ అయోధ్య కోసం మొత్తం శోధనలలో 1500% పెరుగుదలను గమనించింది.

క్లియర్‌ట్రిప్ సీఈఓ అయ్యప్పన్ రాజగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “కస్టమర్-సెంట్రిక్ కంపెనీగా క్లియర్‌ ట్రిప్ మా యూజర్ బేస్ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీరుస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు మన సంస్కృతికి ప్రధానమైనవి, శతాబ్దాల నాటి సంప్రదాయాలను మూర్తీభవిస్తున్నాయని మేం అర్థం చేసుకున్నాం. ఎక్కువ మంది వ్యక్తులు ఈ అర్థవంతమైన ప్రయాణాలను కోరుతున్నందున, ఈ అనుభవాలను మరింత అందుబాటులోకి, సరసమైన ధరకు అందించాలని మేం కోరుకుంటున్నాం.

అయోధ్యలో త్వరలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలోనే ఈ ఆఫర్ ను ప్రారంభించేందుకు మేం సంతోషిస్తున్నాం. మా ఆఫర్ దేశం యొక్క గొప్ప వారసత్వంలో మునిగిపోవాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది మా కస్టమర్ల విభిన్న అవసరాలను తీర్చడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక గమ్య స్థానాలను అనుభూతి చెందడానికి, వారి ప్రయాణ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవడానికి ఇత ర వ్యక్తు లకు స్ఫూర్తిని అందించాలని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

దర్శన్ డెస్టినేషన్స్ వంటి కస్టమర్-సెంట్రిక్ ఇనిషియేటివ్‌ల ద్వారా స్థోమత, అందుబాటు, ప్రయాణం అంతటా వినియోగదారులు కోరుకునే అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని సజావుగా మిళితం చేయడాన్ని క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ కొనసాగిస్తాయి.

క్లియర్‌ట్రిప్: పైన పేర్కొన్న గమ్యస్థానాలకు డొమెస్టిక్ విమానాలపై ఫ్లాట్ 20% తగ్గింపు కేవలం సీనియర్ సిటి జన్‌లకు సీనియర్ సిటిజన్ రాయితీ ఛార్జీలపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. పైన పేర్కొన్న గమ్య స్థానాలకు హోటల్‌లు, బస్సులపై ఫ్లాట్ 20% తగ్గింపు ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంది.

Flipkart ప్రయాణం: వినియోగదారులందరికీ పైన పేర్కొన్న గమ్యస్థానాలకు అన్ని దేశీయ విమానాలు, హోటళ్లపై ఫ్లాట్ 20% తగ్గింపు (పరిమిత ఇన్వెంటరీ మాత్రమే)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News