Thursday, June 27, 2024

రేణుకాస్వామి హత్యకు ముందు పబ్ పార్టీలో గడిపిన దర్శన్.. వెల్లడైన వాస్తవాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రఖ్యాత కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ఆరోజు రేణుకాస్వామి హత్యకు ముందు బెంగళూరులో పబ్ పార్టీలో పాల్గొన్నాడని ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ఆ వర్గాల కథనం ప్రకారం… పార్టీ తరువాత రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి నిర్బంధంలో ఉంచిన షెడ్‌కు దర్శన్ వెళ్లి , రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు.

ఆ సమయంలో షెడ్‌లో దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ అక్కడే ఉన్నారు. హత్య తరువాత నిందితులు ముగ్గురు బెంగళూరు లోని ఆర్‌ఆర్ నగర్‌లో రిలయన్స్ ట్రెండ్స్ షాపునకు వెళ్లి రక్తపు మరకలున్న తమ దుస్తులను మార్చుకున్నారు. బెంగళూరు పోలీస్‌లు సోమవారం అదే షాపుకు నిందితులను తీసుకెళ్లి నేరదృశ్యాన్ని తిరిగి చిత్రీకరించారు. దర్శన్‌ను కూడా మైసూరుకు తీసుకెళ్లి నేర దృశ్యాన్ని తిరిగి సృష్టించ వచ్చు.

చిత్రదుర్గ లోని నిందితుడు రాఘవేంద్ర ఇంటిలో రేణుకాస్వామి బంగారం గొలుసు, వాలెట్‌ను పోలీస్‌లు కనుగొన్నారు. రేణుకాస్వామి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేసిన తరువాత కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. హత్యకు ముందు రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టారని, ఎలెక్ట్రిక్ షాక్ పెట్టారని బయటపడింది. ఈ కేసులో జూన్ 16న అరెస్ట్ అయిన నిందితుడు ధనరాజ్ ఆరోజు రేణుకాస్వామి చిత్రహింసల గురించి వివరించారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ,లతోపాటు మొత్తం 19 మంది నిందితులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News