Sunday, January 19, 2025

‘దాస్ కా ధమ్కీ’ షురూ

- Advertisement -
- Advertisement -

Das ka DhamKi shooting started

ఫలక్‌నుమా దాస్, పాగల్, హిట్ చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ బుధవారం నాడు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్‌పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ‘ఎఫ్3’ దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా స్క్రిప్ట్‌ను నిర్మాత, దర్శకుడికి రచయిత ప్రసన్నకుమార్ అందజేశారు. అనంతరం అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “మాస్ అప్పీల్ ఉండే సినిమా ఇది. థియేటర్‌లో ప్రేక్షకులు ఊగిపోయేలా ఉండే కథ ఇది.

కృష్ణదాస్ గాడి జీవితంలో జరిగే కథే ఈ సినిమా. ఈనెల 14నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము”అని అన్నారు. చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ “ఫలక్‌నుమా దాస్ చిత్రం తర్వాత అదే టీమ్‌తో చేస్తున్న సినిమా ఇది. మా బ్యానర్‌లో మంచి వినోదాత్మకమైన సినిమాలను తీయాలని ప్రయత్నిస్తున్నాము”అని చెప్పారు. చిత్ర దర్శకుడు నరేశ్ కుప్పిలి మాట్లాడుతూ“ పాగల్ సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. లియో బాణీలు చక్కగా వచ్చాయి”అని తెలిపారు. ఈ చిత్రానికి రచయితః ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరాః దినేష్ కె.బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, ఎడిటర్‌ః అన్వర్ అలీ,ఆర్ట్‌ః ఎ.రామాంజనేయులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News