Monday, December 23, 2024

దశాబ్ది పార్క్‌ను జెవిజి కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జెవిజి కాలనీలో ఏర్పాటు చేసిన హరితోత్సవం దినోత్సవం కార్యక్రమంలో భాగంగా దశా బ్ది పార్క్‌ను జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ ప్రారంభించి మొ క్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దశాబ్ది పార్క్ కాలనీ వాసులకు, చుట్టు ప్రక్కల కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక ఈ హరితహరం అన్నారు. ఈ తొమ్మది సంవత్సరాల హరితహరం కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం 7.79 శాతం పెరిగిందన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కోనటం, మన తెలంగాణ రాష్ట్రం పట్ల పుడమి పట్ల మన సిఎం కెసిఆర్‌కి ఉన్న ఆపేక్ష, ప్రేమ మనకు అర్థం అవుతుందన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయంలో ఈ తొమ్మిది ఏళ్ళల్లో గరిష్ట రికార్డు స్ధాయిలో 273 కోట్ల మొక్కలు నాటటం జరిగిందన్నారు.

రాష్ట్రంలో 2015/16 నాటికి అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా ఈ 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్ల పెరిగిందన్నారు. సిఎం కెసిఆర్ హరితహరం కార్యక్రమం చేపట్టి, మన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని మణిహరంగా మారుస్తున్నారన్నారు. అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సిఎం కెసిఆర్ తెలంగాణకు హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పాటిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిడవిల్లుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఔషధ గుణాలు గల మొక్కలు, పండ్ల జాతుల మొక్కలు నాటి ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటి సంరక్షిస్తామన్నారు. 260 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా హరితహారం ద్వారా మొక్కలు నాటడం జరిగిందన్నారు. 7.79 శాతం అడవుల శాతం పెరిగిందన్నారు. ఆకుపచ్చని తెలంగాణా లక్షంగా ప్రతి ఏ టా నిర్వహిస్తున్న హరితహరంతో తెలంగాణలో అడవుల శాతం పెరిగిందన్నారు. అర్బన్ బయోడైవర్సీటీ డిప్యూటి డైరెక్టర్ అనిల్‌కుమా ర్, మేనేజర్లు యూసఫ్, సమీర, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్‌రెడ్డి, కా లనీ వాసులు వసంత సాయి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News