Sunday, December 22, 2024

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ లో దసరా పండుగ సంబరాలు

- Advertisement -
- Advertisement -

Dasara festival offers at Inorbit Mall Hyderabad

హైదరాబాద్‌: ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద పండుగ సంబరాలకు అంతా సిద్ధమైంది. ఉత్సాహపూరితమైన ఆఫర్లు, వేడుకలు, కార్యక్రమాలతో సందర్శకులను ఆహ్వానించడానికి ఇనార్బిట్‌ ఆహ్వానిస్తుంది. ఈ మాల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సందర్శకులు ఈ పండుగ సీజన్‌లో మాల్‌ ఏం అందిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రకాశవంతమైన బంగారం, క్రిస్టల్‌ నేపథ్యంతో తీర్చిదిద్దిన డెకార్‌ వీరిని ఆహ్వానిస్తుంది. ఇవేనా అత్యంత అందమైన పీకాక్‌ హ్యంగింగ్స్‌ అట్రియంలో ఉండటంతో పాటుగా పండుగ స్ఫూర్తిని మరింతగా పెంపొందించనున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషం పంచుకోవడానికి, ఫోటో సెషన్స్‌ కు అత్యంత ఆకర్షణీయంగా ఇది ఉంటుంది!.

షాపర్ల కోసం ఇనార్బిట్‌ మాల్‌ అసంఖ్యాక ఆఫర్లను తీసుకువచ్చింది. ఫిజ్జీ గోబ్లెట్‌, మాన్యవర్‌, సోచ్‌, బిబా వంటివి తమ పండుగ కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నాయి. పాంటాలూన్స్‌ తమ కలెక్షన్‌పై 40–70% తగ్గింపు అందిస్తుంది. మ్యాక్స్‌, అండ్‌, లైఫ్‌స్టైల్‌ వంటివి బహుమతులను కొనుగోళ్లతో పాటుగా అందిస్తున్నాయి. ఒరా జ్యువెలరీ బ్రాండ్‌ 25% వరకూ రాయితీని వజ్రాభరణాల శ్రేణిపై అందిస్తుంది. అదే సమయంలో బ్లూ స్టోన్‌ 25% వరకూ తగ్గింపును మేకింగ్‌ చార్జీలపై అందిస్తుంది. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఒక కోటి రూపాయలకు పైగా లక్కీ డ్రా ను సందర్శకులకు నిర్వహిస్తుంది.

ఈ ఆఫర్లతో పాటుగా షాపర్లకు ఆనందాన్ని పంచే సమాచారం కూడా ఇక్కడ ఉంది. ‘యువర్‌ స్పెండింగ్‌ ఈజ్‌ రివార్డింగ్‌’ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులు తమ బిల్స్‌ను అందించిన/రిడీమ్‌ చేసుకున్న ఎడల ఇన్‌ కాయిన్స్‌ పొందగలరు. వినియోగదారులకు ఈ దిశగా సహాయపడేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ సైతం ఏర్పాటుచేశారు. అంతేనా, ఇనార్బిట్‌ మాల్‌ వద్ద సందర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే వారి నైపుణ్యం ప్రదర్శించుకునే అవకాశం కల్పించి బ్రాండ్‌ ఓచర్లు, ఇన్‌ కాయిన్స్‌ అందిస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో ఇనార్బిట్‌ వద్ద ఎన్నో జరుగబోతున్నాయి. మిస్‌ కాకూడదనుకుంటే వెంటనే ఇనార్బిట్‌ను సందర్శించేయండి!.

Dasara festival offers at Inorbit Mall Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News