హైదరాబాద్: ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. బెజవాడ దుర్గమ్మ ఈ రోజు బాల త్రిపుర సుందరీదేవిగా అలంకరనలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.అమ్మవారు ఈ సంవత్సరం తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనుంది.
మొదటి రోజు ఆదివారం శ్రీబాల త్రిపుర సందరీదేవా, సోమవారం గాయత్రీ దేవా, ,మంగళవారం అన్నపూర్ణాదేవి, బుధవారం మహాలక్ష్మీదేవీ, గురువారం శ్రీమహాచండీదేవి, శుక్రవారం సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఏడవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి , తొమ్మిదో రోజు ఉదయం మహిషాసుర మర్దినిదేవి, మధ్యాహ్నం 1 గంట నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నా