Monday, December 23, 2024

దసరా… టాప్ లేచిపోయే సినిమా

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో అనంతపురంలో ‘దసరా’ దూమ్ ధామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ “దసరా చిత్రంతో ప్రేక్షకులకు గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది.

దసరా చిత్రంలో యాక్షన్ మరో లెవెల్‌లో ఉంటుంది. సూరి పాత్రలో దీక్షిత్ అద్భుతంగా చేశాడు. సాయి కుమార్, సముద్రఖని షైన్ టాం చాకో… ఇలా అందరూ అద్భుతంగా నటించారు. నేను లోకల్ చిత్రం తర్వాత నేను, కీర్తి కలిసి చేసిన ఈ మూవీ మరచిపోలేని సినిమాగా ఉంటుంది. దసరా… టాప్ లేచిపోయే సినిమా”అని అన్నారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ “ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు అందరికీ వెన్నెలగా గుర్తుంటాను. దర్శకుడు శ్రీకాంత్ చాలా కష్టపడి ఈ కథని రాశారు. అన్ని ఎలిమెంట్స్ వున్న ఫుల్ ప్యాకేజీ ఇది. మార్చి 30 ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎట్లయితే గట్లయితది చూసుకుందాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ఒదెల, సుధాకర్ చెరుకూరి, దీక్షిత్ శెట్టి, అవినాష్ కొల్లా, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News