Monday, December 23, 2024

‘దసరా’కు 6 అవార్డులు

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హై-ఆక్టేన్ మాస్, యాక్షనర్ ‘దసరా’ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో ఆరు ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ సొంతం చేసుకొని సత్తా చాటింది. ధరణి క్యారెక్టర్‌లో అదరగొట్టిన నాని ఉత్తమ నటుడు, వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు. ఎనర్జిటిక్, ఎంగేజింగ్ ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ను అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ అవార్డులను అందుకున్నారు. 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బేబి’ ఐదు ఫిలింఫేర్ వార్డులతో మెరిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News