Monday, December 23, 2024

నాని ‘దసరా’ మూవీ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

Dasara Movie Pooja Ceremony in Hyderabad

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. నాని తన న్యూ మూవీ ‘దసరా’ను ఇప్పటికే ప్రకటించిన  విషయం తెలిసిందే. బుధవారం హైద‌రాబాద్‌లో ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూవీలో నాని సరసన మహానటి కీర్తి సురేష్ రెండోసారి కథానాయికగా నటిస్తోంది. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో నటించే నటీనటులు, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా, నాని ఇటీవల శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

Dasara Movie Pooja Ceremony in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News