Wednesday, January 22, 2025

నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం..(దసరా టీజర్)

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, మహానటి కీర్తిసురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. ‘ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం’, ‘నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్‌’ అంటూ తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక, టీజర్ మూవీపై భారీగా అంచనాలను పెంచేసింది. బొగ్గుగని బ్యాక్‌ డ్రాప్‌లో ఊరమాస్ యాక్షన్ మూవీగా టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ కీలక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News